Saturday 17 February 2018

Chimma Cheekati Kammukonnadi Naa Kantilo Song Lyrics

చిమ్మ చీకటి కమ్ముకొన్నది నా కంటిలో

పల్లవి:  చిమ్మ చీకటి కమ్ముకొన్నది నాకంటిలో – నీ ఇంటి నుండి వెడలినప్పుడు ||2||
         కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో – నీకంటికి బహుదూరమైనప్పుడే
         యేసయ్య నా తండ్రివయ్యా – నీ వాడిని నీచిన్నోడిని ||2||

1.     మోయలేని కష్టాలతో కడవలి కన్నీళ్ళతో
    సతమతమై సొమ్మసిల్లి పోయాను నా తండ్రి
     నీ ప్రేమ నెరిగి కనువిప్పు కలిగి
    మారుమనస్సు కలిగి తిరిగివచ్చానే నీ దుడుకు కొడుకునే
    యేసయ్య నా తండ్రివయ్యా – నీ వాడిని నీచిన్నోడిని ||2||

2.        శరీరమును అనుసరించి జీవించిన వాడినే
     ఆత్మీక జీవితమును నేర్పించు నా తండ్రీ
      నిను వీడనయ్యా ఏనాటికైనా
     నీ ఎదపై ఒదిగి బ్రతికి కనుమూయనా నాకెంత భాగ్యము
     యేసయ్య నా తండ్రివయ్యా – నీ వాడిని నీచిన్నోడిని ||2||

No comments: