Wednesday 24 January 2018

Ihaparaalanu Srujiyinchina Tandridevaa

ఇహపరాలను సృజియించిన తండ్రిదేవా


సాకి:         ఇహపరాలను సృజియించిన తండ్రిదేవా... వందనం
                   ఇహములోన జనియించిన యేసుదేవా... వందనం
                   బహువరాలు కురిపించు ఆత్మదేవా... వందనం
                   త్రియేక దేవా వందనం స్వాగతం తండ్రీ 
                 ఘనస్వాగతం... ప్రభువా స్వాగతం...

పల్లవి:       దిగిరండి దివినుండి భువిలోన వసియించండి ||2||
                   దైవవాక్కు (క్రీస్తుజ్యోతి) ఆలయములో ప్రేమజ్యోతియై నిలవండి||2||
                   అందుకొనుమో తండ్రీ మా అంజలి నిరంతరం
                   స్వాగతం ఘనస్వాగతం ప్రభువా స్వాగతం

                   గామపసారి పగామప గామపాసారిపగారిసా
 1.              నీ మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా నీ జనం ||2||
స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై గుమి కూడిన ఈ శుభదినం ||2||
అందుకొనుమో తండ్రీ మా అంజలి నిరంతరం
స్వాగతం ఘనస్వాగతం ప్రభువా స్వాగతం

              సగగగాసని సాగమసా పసనిసారీప మపమగా
2.              నీ కృపతో కట్టిన ఈ ఆలయం నీ కృపతో నిండిన ఆశయం ||2||
వినిపింతు దేవా మా విన్నపాలు కరుణించు దేవా కరుణతో ||2||
అందుకొనుమో తండ్రీ మా అంజలి నిరంతరం
స్వాగతం ఘనస్వాగతం ప్రభువా స్వాగతం

No comments: