కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధ
పల్లవి: కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధ
కరిగి పోని పెన్నిధి క్రీస్తు పుణ్య కథ
నిరాశల నిశీధిలో విరాగపు ఎడారిలో
కన్నతోడు ఉన్న నీకు క్రీస్తు నీకు జత
కన్నతోడు ఉన్న నీకు క్రీస్తు నీకు జత
కరుణ చూపి కలత బాపు కన్నా తండ్రి కథ మనకున్న తండ్రి
కథ
1.
ఆకలైన
వేళలో అన్నమతడు తెలుసుకో
చీకటిపడు వేళలో దీపమతడు తెలుసుకో
వేళా
లేదు పాలా లేదు శరణు వేడుకో
పేద సాద అంతే చాలు కరుణ చూపగా
మహిజనులను
మహిమ తెలిపి
ఆ మమతలు చూపగా తీరిపోవు వ్యథ ||కీర్తనీ||
2. తల్లడిల్లు
వేళలో తల్లి ప్రేమ అతనిది
తననే విడనాడిన తండ్రి మనస్సు అతనిది
పాపాలెన్నో
చేసే జన్మ పదములంటిన
కామం క్రోధం లోభం మోహం సిలువ వేసిన
కఠిన జనుల కలి నరులను ప్రేమ కలిగి బ్రోచిన
ప్రేమమూర్తి మనకున్న తండ్రి కథ ||కీర్తనీ||
No comments:
Post a Comment