Thursday 1 February 2018

Gudi Gantalu Piluchuchunnadi songs lyrics

గుడి గంటలు పిలుచుచున్నది


పల్లవి:        గుడి గంటలు పిలుచుచున్నది ప్రభు పూజకు వేళైయున్నది
                   పరవశ హృదయముతో పరుగున వెళ్ళెదము ||2||
                   పరమ ప్రభుని పూజించుటకు నవ్యతతో జీవించుటకు ||గుడి||

1.            దేవుడే మానవుడై అవతరించినాడు
         మనుషుల కొరకై తాను మహిమ వీడినాడు
వాగ్ధాన ఫలములను మనకు ఇచ్చినాడు
వారసులుగ మనలను తాను చేసినాడు
స్తుతి యాగాముతో భక్తి కీర్తనతో వాక్య పఠనముతో దూప దీపముతో
దివ్య పూజలో పాల్గొందము నవ్య హృదయముతో జీవింతము ||2||
||గుడి||

             2.         మట్టితో మనిషిని తాను చేసినాడు
                    మహిమ గల పాత్రగా వాడుచున్నాడు
           స్నేహితులని మనలను పిలుచుచున్నాడు
          పరలోక రాజ్యమును దారి చూపుతాడు
         స్తుతి యాగాముతో భక్తి కీర్తనతో వాక్య పఠనముతో దూప దీపముతో
         దివ్య పూజలో పాల్గొందము నవ్య హృదయముతో జీవింతము ||2|| ||గుడి||

No comments: